- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుట్‌బాల్ పండుగ ముహూర్తం ఫిక్స్.. ఫిబ్రవరి 14 నుంచి ఐఎస్ఎల్
ఫుట్‌బాల్ పండుగ ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 14 నుంచి ఐఎస్ఎల్ మొదలవుతుందని కేంద్రం ప్రకటించింది.

దిశ, స్పోర్ట్స్: భారత్‌లో ఫుట్‌బాల్‌కు క్రేజ్ పెంచిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) భవితవ్యంపై క్లారిటీ వచ్చింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. మొత్తం 14 క్లబ్బులు ఈ పోటీలో ఆడుతున్నాయని స్పష్టంచేశారు. కమర్షియల్ పార్టనర్ లేకపోవడం సహా కొన్ని న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న ఈ లీగ్.. అసలు జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు ఎదుర్కొంది. దీనిపై క్రీడాశాఖ, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), 14 ఐఎస్ఎల్ క్లబ్బుల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో సమస్యలన్నీ పరిష్కారమైనట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మోహన్ బగన్, ఈస్ట్ బెంగాల్ క్లబ్బులు కూడా పాల్గొంటున్నట్లు మాండవీయ స్పష్టంచేశారు. హోం, ఎవే ఫార్మాట్లో జరిగే ఈ లీగ్‌లో మొత్తం 91 మ్యాచులు జరుగుతాయని, దీనికోసం అవసరమైన లాజిస్టిక్ ప్లాన్లు వేస్తున్నామని ఏఐఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ కల్యాణ్ చౌబే తెలిపారు. ఐఎస్‌ఎల్‌తోపాటు తాత్కాలికంగా నిలిపివేసిన ఐ-లీగ్‌ను కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. దీంట్లో 11 క్లబ్బులు ఆడతాయని, మొత్తం 55 మ్యాచులు జరుగుతాయని వివరించారు.






