- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మాట్‌లో ఇషాన్ కిషన్ మెరుపులు.. 45 బంతుల్లో సెంచరీ!
స్మాట్‌లో ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేసి జార్ఖండ్‌ను గెలిపించాడు.

దిశ, స్పోర్ట్స్: భారత జట్టులో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్న యువబ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో శతకంతో రెచ్చిపోయారు. త్రిపుర, జార్ఖండ్ మధ్య జరిగిన మ్యాచులో కిషన్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. మొత్తం 183 పరుగుల ఛేజ్‌లో కిషన్ రెచ్చిపోవడంతో జార్ఖండ్ కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, అదిరే విజయం నమోదు చేసింది. కిషన్‌కు విరాట్ సింగ్ (53 నాటౌట్) నుంచి మంచి సహకారం అందింది. ఆరంభంలో 4.2 ఓవర్లలో 32/2తో జార్ఖండ్ టీం కష్టాల్లో ఉండగా కిషన్ తన విశ్వరూపం చూపించాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన కిషన్ 50 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్సులో 8 సిక్సులు, 10 ఫోర్లు ఉండటం గమనార్హం. ఈ టోర్నీ తొలి రెండు మ్యాచుల్లో 27, 15 స్కోర్లు చేసిన కిషన్.. ఇలా ఫామ్ అందుకోవడం జార్ఖండ్‌కు బాగా కలిసొస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, గతేడాది కిషన్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.






