INDvsWI : 'నువ్వు ధోనీ కాదంటూ లెజెండ్ సెటైర్'.. కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్!

by Disha Web Desk 13 |
INDvsWI : నువ్వు ధోనీ కాదంటూ లెజెండ్ సెటైర్.. కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై మాజీ లెజెండ్ ఆకాష్ చోప్రా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వీటికి కిషన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విండీస్ పర్యటనలో మూడు వన్డేల్లో కలిపి ఇషాన్ కిషన్‌ 184 పరుగులతో రాణించాడు. ఈ సిరీసులో మూడు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేయగా.. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది ప్లేయర్ల జాబితాలో చేరాడు. ఈ సిరీస్ చివరి మ్యాచ్‌లో ఆకాష్ చోప్రాతో కిషన్ ఫన్నీ సంభాషన జరిగింది.

ఈ మ్యాచులో ఒక స్టంపిగ్ కోసం కిషన్ అప్పీల్ చేశాడు. ఇది చూసిన ఆకాష్ చోప్రా వెంటనే దీనిపై సెటైర్ వేశాడు. 'స్టంపింగ్, రనౌట్ నిర్ణయాలను అప్పీల్ చేయడం చాలా అరుదు. నాకైతే బ్యాటర్ కాళ్లు నేలపైనే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 'నువ్వు రాంచీ నుంచి వస్తుండొచ్చు.. కానీ నీ పేరు ఎంఎస్ ధోనీ కాదు' అని చోప్రా సెటైర్ వేశాడు. ఇది విన్న కిషన్ నవ్వేస్తూ.. 'అవునా.. అలాగైతే ఓకే' అని అనడం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. ఇది విన్న చోప్రా.. 'నువ్వు చాలా మంచి వాడివి. మాకు నువ్వంటే చాలా ఇష్టం ఇషాన్' అని సమాధానం ఇచ్చాడు.


Next Story