- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli Net Worth: విరాట్ కోహ్లీ నెట్ వర్త్ ఎంత? లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోతుంది
Virat Kohli Net Worth: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకుపోతోంది.

దిశ, వెబ్ డెస్క్: Virat Kohli Net Worth: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకుపోతోంది. చెన్నై పై సంచలన విజయంతో 16 పాయింట్లతో టేబుల్ టాప్ కు చేరుకుంది. ఇక ఆ జట్టు కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్ తో విమర్శలకు సమాధానం చెప్పుతూ.. ఆరెంజ్ క్యాప్ లో టాప్ లో నిలిచాడు. వాస్తవానికి ఆరెంజ్ క్యాప్ మాత్రమే కాదు నెట్ వర్త్ విషయంలో కోహ్లీ టాప్ లో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సంపద విషయంలో ఇతర ప్రముఖ ఆర్సీబీ ప్లేయర్స్ ఎవ్వరూ విరాట్ కోహ్లీని చేరుకోలేరు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో పలువురు ప్రముఖ ఆర్సీబీ ప్లేయర్స్ నెట్ వర్త్ వివరాలు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ:
పలు మీడియా కథనాల ప్రకారం.. ఆర్సీబీలో మాత్రమే కాదు.. ప్రపంచ సంపన్న క్రికెటర్స్ జాబితాలో విరాట్ కి స్థానం ఉంది. ఐపీఎల్ 2025కి ముందు విరాట్ నెట్ వర్త్ రూ. 1050కోట్లు. సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో సంపన్న భారత్ క్రికెట్ కోహ్లీనే.
జాష్ హేజుల్ వుడ్ :
ఈ ఆస్ట్రేలియన్ బౌలర్ ప్రస్తుతం ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఈయన నెట్ వర్త్ జాబితాలో రెండోస్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ అతన్ని రూ. 12.5కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం మీద చూసుకుంటే జాష్ హేజుల్ వుడ్ నెట్ వర్త్ రూ. 80కోట్లు.
క్రుణాల్ పాండ్య :
ఆల్ రౌండర్ క్రుణాల్ పాండ్య ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. అతన్ని ఆర్సిబి 5.75కోట్లకు కొనుగోలు చేసింది. 34ఏళ్ల ఈ ఆటగాడి సంపద రూ. 70కోట్ల వరకు ఉంటుంది.
లియామ్ లివింగ్ స్టన్ :
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఈ క్రికెటర్ ను ఆర్సిబీ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది.లియామ్ నెట్ వర్త్ రూ. 51కోట్ల వరకు ఉంటుంది.
టిమ్ డేవిడ్ :
29ఏళ్ల ఆస్ట్రేలియన్ క్రికెటర్ ను ఆర్సీబీ రూ. 3కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రికెటర్ నెట్ వర్త్ రూ. 43కోట్లు.
ఫిలిప్ సాల్ట్ :
ఈ ఆటగాడిని ఆర్సీబీ ఏకంగా రూ. 11.50కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతని నెట్ వర్త్ రూ. 25కోట్లు.
రజత్ పటీదార్ :
ఈ ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన ఈ బ్యాటర్ ను రూ. 11కోట్లకు కొనుగోలు చేసింది. అతని నెట్ వర్త్ రూ. 20కోట్లు.






