- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో మైలురాయిని సాధించాడు.

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో మైలురాయిని సాధించాడు. ఐపీఎల్‌లో 4,000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య 28 బంతుల్లో 54 రన్స్ చేయడంతో అతను ఈ ఫీట్ సాధించాడు. అలాగే, 2,714 బంతుల్లో 4 వేల రన్స్ మైలురాయిని చేరుకున్న సూర్యకుమార్ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా వేగంగా 4 వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో సూర్య 3వ స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్(2,658 బంతుల్లో) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. డేవిడ్ వార్నర్(2809), సురేశ్ రైనా(2,881) టాప్-5లో ఉన్నారు. సూర్య 145 ఇన్నింగ్స్‌ల్లో 4 వేల రన్స్ మార్క్ అందుకోగా.. అందులో రెండు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేట్ 146గా ఉన్నది. 4 వేలు లేదా అంతకంటే ఎక్కువ రన్స్ చేసిన భారత క్రికెటర్లలో సూర్యదే టాప్ స్ట్రైక్‌రేట్ కావడం గమనార్హం. సూర్య కంటే ముందు డివిలియర్స్(151.68), గేల్(148.96) ఉన్నారు. లక్నోపై 4 సిక్సర్లు కొట్టిన సూర్య ఐపీఎల్‌లో 150 సిక్స్‌లను పూర్తి చేశాడు.






