- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : ఇలాంటి కోచ్ దొరకడం రాజస్థాన్ అదృష్టం.. ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటపై తనకున్న నిబద్ధత, ప్రేమను చూపించాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటపై తనకున్న నిబద్ధత, ప్రేమను చూపించాడు. అతను చేసిన పని క్రికెట్ అభిమానుల మనసును దోచుకుంది. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఓ టోర్నీలో పాల్గొన్న ద్రవిడ్ గాయపడిన విషయం తెలిసిందే. అతని ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మరోవైపు, ఐపీఎల్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే రాజస్థాన్ ప్లేయర్లు ద్రవిడ్ లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్‌గా తన బాధ్యతను నిర్వర్తించాలని భావించిన ద్రవిడ్ గాయాన్ని కూడా లెక్కచేయలేదు. నడవలేని స్థితిలో ఉన్నా తన ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గురువారం జైపూర్‌లోని రాజస్థాన్ ట్రైనింగ్ క్యాంప్‌కు వచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోలో ద్రవిడ్ ఊత కర్రలు(క్రచెస్) సాయంతో నడుస్తూ కనిపించాడు. కాలికి బ్యాండేజీ లాంటి భారీ పట్టు ఉంది. నడవడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. క్రచెస్ పట్టుకునే నడుస్తూ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. రియాన్ పరాగ్, యశస్వి జైశ్వాల్‌తోపాటు ఇతర ప్లేయర్లకు సూచనలు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘హ్యాట్సాఫ్ ద్రవిడ్’ అని మెచ్చుకుంటున్నారు. ‘ఇలాంటి కోచ్ దొరకడం రాజస్థాన్ అదృష్టం.’అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
💗➡️🏡 pic.twitter.com/kdmckJn4bz
— Rajasthan Royals (@rajasthanroyals) March 13, 2025






