- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర గాయం తర్వాత భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు తీవ్ర గాయం అయింది.

దిశ, వెబ్ డెస్క్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు తీవ్ర గాయం అయింది. ఓ క్యాచ్ పట్టేందుకు వెనక్కి పరిగెత్తిన శ్రేయస్.. డైవ్ కొట్టడంతో మోకాలు తో పాటు పక్కటెముకలు కింది భాగంలో తీవ్ర గాయం అయింది. దీంతో అంతర్గత రక్తస్రావం కావడంతో ఆయనకు వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదాపు మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచిన వైద్యులు అతనికి శాస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో అయ్యర్ వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇదిలా ఉంటే గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ తన ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అందులో.. "నేను ప్రస్తుతం కోలుకుంటున్నాను. ఈ పరిస్థితిలో ఉన్న నాకు అన్ని వర్గాల నుంచి అందిన మద్దతును చూసి నేను చాలా కృతజ్ఞుడయ్యాను. ఇది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నన్ను మీ ఆలోచనలలో ఉంచినందుకు ధన్యవాదాలు" అని రాసుకొచ్చాడు. దీంతో అయ్యర్ వేగంగా కోలుకోవడంపై అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






