'మూడేళ్ల నిషేధం'పై.. 'అంతిమ్ పంఘాల్' ఆసక్తికర వ్యాఖ్యలు!

by Geesa Chandu |   (  Updated:2024-08-08 12:12:45  IST  )

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఫైనల్ కు ముందు స్టార్ రెజ్లర్.. వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు బాధను మర్చిపోకముందే యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ నిషేధానికి గురైంది.

మూడేళ్ల నిషేధంపై.. అంతిమ్ పంఘాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఫైనల్ కు ముందు స్టార్ రెజ్లర్.. వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు బాధను మర్చిపోకముందే యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ నిషేధానికి గురైంది.

అంతిమ్ పంఘాల్ ఏమన్నారంటే..

"తనను పోలీసులు తీసుకెళ్లారనడం తప్పు. బుధవారం మ్యాచ్ ఓడిపోయిన అనంతరం నాకు జ్వరం వచ్చింది. ఆ సమయంలో హోటల్లో ఉన్న మా సోదరిని చూసేందుకు అనుమతి కోరగా.. లభించింది. అనంతరం హోటల్ కు వెళ్లాను. ఈ క్రమంలో నాకు క్రీడా గ్రామంలో ఉన్న నా లగేజీ అవసరమైంది. దీంతో నా అక్రిడేషన్ కార్డుతో నా సోదరి క్రీడా గ్రామానికి వెళ్ళి లగేజీ అడిగింది. అక్కడున్న సిబ్బంది అక్రిడేషన్ కార్డును తీసుకొని వేరిఫికేషన్ కోసం నా సోదరిని.. పోలీసుల వద్దకు పంపారు. ఇంకా క్యాబ్ డ్రైవర్ తో.. కోచ్ గొడవకు దిగాడని కూడా చెప్పారు. కానీ అది నిజం కాదని చెప్పింది. దీని వల్లే తనపై ఒలింపిక్స్ లో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు" అంతిమ్ పంఘాల్ చెప్పారు.

Next Story