క్యాస్పర్ రూడ్‌కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్లో అవుట్!

by Phanindra |

ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టార్ ప్లేయర్ క్యాస్పర్ రూడ్‌కు షాక్. గాయంతో సతమతమై రెండో రౌండ్లో నిష్క్రమణ.

క్యాస్పర్ రూడ్‌కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్లో అవుట్!
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ నెంబర్ 8 క్యాస్పర్ రూడ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో షాకింగ్ ఓటమి ఎదురైంది. ప్రపంచ నెంబర్ 41 నూనో బోర్గెస్ చేతిలో రెండో రౌండ్‌లోనే రూడ్ ఓడిపోయాడు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇబ్బందిగా కనిపించిన రూడ్.. గాయం వల్ల సరిగా ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే 2-6, 6-4, 6-1, 6-0 తేడాతో బోర్గెస్ చేతిలో చిత్తయ్యాడు. గతంలో 2022, 2023 ఫ్రెంచ్ ఓపెన్‌లో రూడ్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మరో స్టార్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ 6-3, 4-6, 6-1, 6-2 తేడాతో ఫాబియన్ మరోజన్‌పై నెగ్గి మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌లో ఇటలీ స్టార్ జాస్మిన్ పాలినీ 6-3, 6-3 తేడాతో ఐలా టామ్‌ల్యానోవిక్‌ను ఓడించి తదుపరి రౌండ్‌కు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియటెక్ కూడా ఎమ్మా రాడుకానుపై అద్భుత విజయంతో ముందంజ వేసింది.

Next Story