- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియాకు షాక్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గిల్ దూరం?
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ ఆదివారం భారత జట్టును ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ ఆదివారం భారత జట్టును ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నట్టు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో గిల్ మెడనొప్పితో మైదానం వీడాడు. రెండో టెస్టు నాటికి కూడా అతను కోలుకోకపోవడంతో గువహతి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. గిల్‌కు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అతని విషయంలో రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం గిల్ ముంబైలో ఉన్నాడు. గాయం తీవ్రత నిర్ధారణకు ఎంఆర్‌ఐ, ఇతర మెడికల్ టెస్టులు చేయించుకున్నాడు. ‘కండరాల గాయమా లేదా నరాల కణజాల సంబంధిత నొప్పి ఉందా అని తెలుసుకోవడానికి అన్ని మెడికల్ టెస్టులు జరుగుతున్నాయి. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతను అందుబాటులో ఉండడు. టీ20 సిరీస్ నాటికి అతను ఫిట్‌గా ఉంటాడని సెలెక్టర్లు ఆశిస్తున్నారు.’అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ గిల్ దూరమైతే వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్‌కు పగ్గాలు అప్పగించే చాన్స్‌లు లేకపోలేదు.






