విరాట్, రోహిత్ కాదు.. భారత క్రీడా రంగంలో అతనే మోస్ట్ పవర్‌ఫుల్

by Dishanational3 |
విరాట్, రోహిత్ కాదు.. భారత క్రీడా రంగంలో అతనే మోస్ట్ పవర్‌ఫుల్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం భారత క్రికెట్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ అంటే అందరూ కెప్టెన్ రోహిత్ శర్మనో, విరాట్ కోహ్లీనో అనుకుంటారు. కానీ, వీరు కాదట. భారత క్రికెటే కాకుండా క్రీడా రంగంలోనే బీసీసీఐ సెక్రటరీ జై షా మోస్ట్ పవర్‌ఫుల్ అని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తేల్చింది. 2024కు సంబంధించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గురువారం ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్’ టాప్-100 జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో రోహిత్, విరాట్ కోహ్లీని జై షా వెనక్కినెట్టారు. క్రీడా రంగంలో జై షా 35వ స్థానంతో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడం, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీకారం చుట్టడంతోపాటు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంలో కీలక పాత్ర పోషించడంతోనే జై షాను ఈ జాబితాలో చేర్చినట్టు సదరు మీడియా సంస్థ తెలిపింది. ఇక, ఈ జాబితాలో ఐదుగురు అథ్లెట్లకు చోటు దక్కింది. విరాట్ కోహ్లీ‌ 38వ ర్యాంక్‌తో అథ్లెట్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా 46వ ర్యాంక్‌లో, ఎం.ఎస్ ధోనీ 58వ స్థానంలో, రోహిత్ శర్మ 68వ స్థానంలో ఉన్నారు. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ 100వ ర్యాంక్‌లో నిలిచింది. మొత్తంగా ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు.


Next Story

Most Viewed