- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లోనే ఉంది : రోహిత్ శర్మ
భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లోనే ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లోనే ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అతని నాయకత్వంలోనే గతేడాది టీ20 వరల్డ్ కప్ దక్కింది. ధోనీ తర్వాత టీమిండియాకు ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ టైటిల్స్ అందించిన భారత కెప్టెన్‌గా ఘనత సాధించాడు. తాజాగా ఐసీసీతో భారత క్రికెట్ భవిష్యత్తుపై రోహిత్ మాట్లాడాడు. యువ ఆటగాళ్లు బాధ్యత స్వీకరించి రాణించాలనే ఆసక్తితో ఉన్నారని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అజేయంగా నిలిచిన తీరు యువకుల అభిరుచిని, నిబద్ధతను సూచిస్తుందని, అది భవిష్యత్తుకు శుభసూచకమని తెలిపాడు. ‘బెంచ్ బలాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నాం. గత 4-5 ఏళ్లుగా మేము అవకాశం వచ్చినప్పుడల్లా యువకులకు అవకాశాలు ఇవ్వడానికే చేస్తున్నాం. వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు కూడా. తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి.. ఎవరిని తప్పించాలి అనే చర్చ జరుగుతుందంటే జట్టు లోతు అర్థమవుతుంది. భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లోనే ఉందని కచ్చితంగా చెప్పగలను. యువకుల్లో ఆటపై అభిరుచి, ప్రతిభ అన్నీ ఉన్నాయి.’ అని చెప్పుకొచ్చాడు. వచ్చే రెండేళ్లలో రెండు ఐసీసీ వైట్‌బాల్ టోర్నీలు ఉన్నాయి. 2026లో టీ20 వరల్డ్ కప్‌కు శ్రీలంకతో కలిసి భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నది. 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.






