T20WorldCupFinal: భారత బ్యాటర్ల విశ్వరూపం: కివీస్‌ ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-08 15:16:22  IST  )

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత బ్యాట్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

T20WorldCupFinal: భారత బ్యాటర్ల విశ్వరూపం: కివీస్‌ ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత బ్యాట్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించి భారత్‌కు సూపర్ స్టార్ట్ అందించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ, అభిషేక్ కివీస్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఎక్కడా తడబడకుండా రెచ్చిపోయారు. కిషన్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(52), సంజూ శాంసన్(89), కిషన్ (54), దూబే (26), హార్దిక్ (18) పరుగులతో అద్భుతంగా రాణించారు.

మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్లుగానే, భారత బ్యాటర్లంతా తమ వ్యక్తిగత మైలురాయి గురించి ఆలోచించకుండా జట్టు స్కోరును పెంచడమే లక్ష్యంగా ఆడారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించాలంటే 256 పరుగులు చేయాలి. కివీస్ బౌలర్లలో నీషమ్ మూడు, రచిన్ రవీంద్ర, హెన్రీ ఒక వికెట్ తీశారు.

Next Story