ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 9 పతకాలు

by Dishanational3 |
ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 9 పతకాలు
X

దిశ, స్పోర్ట్స్ : కిర్గిస్థాన్‌లో జరిగిన ఏషియన్ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తాచాటారు. మొత్తం 9 పతకాలతో టోర్నీని ముగించారు. అందులో నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ టోర్నీలో పలు కేటగిరీల్లో మొత్తం 30 మంది భారత రెజర్లు పాల్గొన్నారు. పురుషుల ఫ్రీస్టైల్ కేటగిరీలో ఉదిత్(57 కేజీలు) రజతం సాధించగా.. అభిమన్యు(70 కేజీలు), విక్కీ(97 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మహిళల రెజ్లింగ్‌లో రాధిక(68 కేజీలు), అంజు(53 కేజీలు), హర్షిత(72 కేజీలు) రజత పతకాలు దక్కించుకున్నారు. శివానీ పవార్(50 కేజీలు), అంతిమ్ కుండు(65 కేజీలు), మనీషా(62 కేజీలు) కాంస్యం గెలుచుకున్నారు. మొత్తం 9 పతకాలతో భారత్ మెడల్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. జపాన్ 19 మెడల్స్‌తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఈ టోర్నీలో భారత్ ఒక బంగారు పతకంతోసహా 14 పతకాలు సాధించింది.

Next Story

Most Viewed