- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS AUS: కుప్పకూలిన ఆసీస్...టీమిండియా మరో విక్టరీ
ఈ నాలుగో టీ20 మ్యాచ్ లో ఏకంగా 48 పరుగుల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ లో లీడింగ్ లోకి

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన అద్భుత విజయం సాధించింది. క్వీన్స్ ల్యాండ్ వేదికగా జరిగిన ఈ నాలుగో టీ20 మ్యాచ్ లో ఏకంగా 48 పరుగుల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ లో లీడింగ్ లోకి వచ్చింది టీమిండియా. ఈ రెండు జట్ల మధ్య మరో టీ20 జరగాల్సి ఉంది. ఇక ఇవాళ్టి మ్యాచ్ వివరాలు పరిశీలిస్తే, మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 167 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది.
గిల్, అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించడంతో టీమిండియా ఈ స్కోరు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా టాప్, మిడిల్ ఆర్డర్ అత్యంత దారుణంగా విఫలమైంది. దీంతో 18.2 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది ఆస్ట్రేలియా. ఈ తరుణంలో 48 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ 2, దూబే 2 వికెట్లు తీశారు. వరుణ్, బుమ్రా, అర్షదీప్ తలో వికెట్ పడగొట్టి,కంగారులను కంగారు పెట్టించారు.
- Tags
- India
- ind vs aus






