- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ మళ్లీ చిత్తు.. అదరగొట్టిన టీమిండియా
ఉమెన్స్ వరల్డ్ కప్(ICC Womens World Cup 2025)లో భాగంగా శ్రీలంకలోని కొలంబో మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ వరల్డ్ కప్(ICC Womens World Cup 2025)లో భాగంగా శ్రీలంకలోని కొలంబో మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. టీమిండియా ప్లేయర్లంతా సమిష్టిగా రాణించి పాకిస్తాన్‌ను చిత్తు చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (46), రిచా ఘోష్ (35), జెమీమా రోడ్రిగ్స్ (32), ప్రతీకా రావల్ (31), దీప్తి శర్మ (25), స్మృతి మంధాన (23), స్నేహ్ రాణా (20), హర్మన్‌ప్రీత్ కౌర్ (19) రాణించారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4, ఫాతిమా సనా 2, సాదియా ఇక్బాల్ 2, రమీన్ షమీమ్, నష్రా సంధు ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇక 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఓపెనర్లతో సహా అందరూ నిరాశపరిచారు. నటాలియా 33 పరుగులతో రాణించగా, సిద్రా ఆమిన్(83) చివరి వరకూ పోరాటం చేసింది. అయినా నిరాశ తప్పలేదు. మిగిలిన ప్లేయర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో క్రాంతి, దీప్తీ శర్మ చెరో మూడు వికెట్లు, స్నేహ్ రాణా రెండు వికెట్లు పడగొట్టారు.
కాగా, ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు కూడా పాకిస్తాన్ జట్టును వరుసగా మూడు సార్లు ఓడించింది. ఫైనల్‌లోనూ పాక్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రాణించి.. ఆసియా కప్ సాధించిన విషయం తెలిసిందే. పరుషుల జట్టు మాదిరిగానే మహిళల జట్టు కూడా పాక్‌పై పైచేయి సాధించడంతో క్రికెట్ లవర్స్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.






