- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన టీమిండియా...పాండ్యా దూరం, బ్యాటింగ్ ఎవరిదంటే
టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ కౌంట్ షురూ అయింది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ మరో 30 నిమిషాల్లోనే ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే..కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. అయితే.. ఈ మ్యాచ్ కు హర్ధిక్ పాండ్యా దూరం అయ్యాడు. అతని స్థానంలో రింకూ సింగ్ రంగంలోకి దిగాడు. అటు బుమ్రా జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు.
ఇరు జట్లు ఇవే
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (C), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి






