India vs Bangladesh: ఆసియా కప్ ఫైనల్‌లో గెలిచేదెవరు?

by Pooja |   (  Updated:2024-12-08 07:50:57  IST  )

దుబాయి వేదికగా అండర్ -19(Under-19) ఆసియా కప్(Asia Cup) ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

India vs Bangladesh: ఆసియా కప్ ఫైనల్‌లో గెలిచేదెవరు?
X

దిశ, వెబ్ డెస్క్:దుబాయి వేదికగా అండర్ -19(Under-19) ఆసియా కప్(Asia Cup) ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్(Bharath), బంగ్లాదేశ్(Bangladesh) జట్లు తలపడుతున్నాయిదీంతో ఎవరు ఛాంపియన్‌గా నిలుస్తారో అనే ఆసక్తి క్రికెట్ లవర్స్‌లో మొదలైంది. ఇప్పటికే సెమీఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ఫైనల్‌‌లో అడుగుపెట్టిన భారత్.. ఫైనల్‌లోనూ రాణిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని ముగ్గురు కీలకమైన బంగ్లా బ్యాటర్లను పెవీలియన్‌కు చేర్చింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కప్ సాధించాలని బంగ్లా ప్లేయర్లు చూస్తున్నారు. బంగ్లాదేశ్‌ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడం వరుసగా ఇది రెండోసారి. కాగా, ఇప్పటికే టీమిండియా 8 ఆసియా కప్‌లు గెలిచిన విషయం తెలిసిందే. ఇది గెలిస్తే తొమ్మిదో కప్ ఖాతాలో పడినట్లవుతుంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారో చూడాలి.

Next Story