- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసియా రిలే చాంపియన్స్‌గా భారత జట్టు.. చైనాను అధిగమించి స్వర్ణం గెలిచిన మన అమ్మాయిలు
ఏసియన్ రిలే చాంపియన్‌షిప్‌లో భారత మహిళల 4x400మీ రిలే జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరిగిన ఏసియన్ రిలే చాంపియన్‌షిప్‌లో భారత మహిళల 4x400మీ రిలే జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. శ్రాబణి నంద, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివంకర్, తమన్నాలతో కూడిన భారత జట్టు చాంపియన్స్‌గా అవతరించింది. ఫైనల్‌లో బలమైన చైనాను అధిగమించి భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. మన అమ్మాయిలు ఎంతో పట్టుదల, వేగంతో ఆకట్టుకున్నారు. 43.85 సెకన్లలోనే రేసు ముగించి సీజన్ బెస్ట్ పర్ఫామెన్స్ చేశారు. 44.09 సెకన్లతో చైనా జట్టు రెండో స్థానంలో నిలువగా.. థాయిలాండ్ టీమ్ 44.11 సెకన్లతో కాంస్యం సాధించింది. తమన్నా, స్నేహలకు ఈ టోర్నీలో రెండు పతకాలు సాధించారు. మిక్స్‌డ్ 4x400మీ రిలేలో కాంస్యం సాధించిన భారత జట్టులో అనిమేశ్ కుజుర్, ప్రణవ్ గురవ్‌లతోపాటు వాళ్లిద్దరూ ఉన్నారు. అదే విభాగంలో భారత జట్టు రజత పతకం కూడా గెలిచింది. ఆ జట్టులో తీర్థేష్ పి శెట్టి, పూవమ్మ, భరత్ శ్రీధర, నీరు పాఠక్ ఉన్నారు. దీంతో ఆసియా రిలే చాంపియన్‌షిప్‌ను భారత్ మూడు పతకాలతో ముగించింది.






