- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా పాక్ సమరం.. దుబాయ్ లో సందడి చేస్తున్న తెలుగు ప్రముఖులు
చాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జోరుగా కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: చాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జోరుగా కొనసాగుతోంది. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చిత్తుచిత్తు అయ్యారు. భారత బౌలర్లు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్ ను ఆల్ అవుట్ చేశారు. ఆల్ అవుట్ సమయానికి పాకిస్థాన్ బాటర్లు 241 స్కోర్ తో ముగించారు. ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం భారత బ్యాటర్లు బరిలో దిగనున్నారు. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఈ క్రమంలోనే లైవ్ మ్యాచ్ ను తిలకించేందుకు క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున దుబాయ్ తరలివెళ్లారు. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. వీరంతా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సందడి చేశారు. వీరిలో పద్మ విభూషన్, మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి మ్యాచ్ ను తిలకిస్తున్నారు. మరో వైపు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు డైరెక్టర్ సుకుమార్, ఎంపీ కేశినేని చిన్ని సహా పలువురు ప్రముఖులు స్టేడియంలో కనిపించారు. వీరంతా హై ఓల్టేజ్ మ్యాచ్ ను లైవ్ లో తిలకించేందుకు దుబాయ్ వెళ్లారు. పాక్ బ్యాటర్లను భారత బౌలర్లు చిత్తు చేయడాన్ని కళ్లార చూసి తెగ సంబరపడిపోతున్నారు. ఇక దీనికి సంబంధించిన దృష్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై వారి అభిమానులు స్పందిస్తూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.






