IND VS PAK: ఇండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్‌...ఉచితంగా ఇలా చూడొచ్చు !

by velandi.Saikiran |

ఇండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్‌ డిడి స్పోర్ట్స్...లో ఈ మ్యాచ్ ఉచితంగా చూసేలా... నిర్ణయం తీసుకున్నారు.

IND VS PAK: ఇండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్‌...ఉచితంగా ఇలా చూడొచ్చు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవ్వాళ జరగనుంది. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్. దాదాపు అర్ధరాత్రి 11:30 గంటల వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొన్న శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య సూపర్ ఓవర్ పరిస్థితులు వస్తే.. అర్ధరాత్రి 12 గంటలకు దాటవచ్చు.

అయితే ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో డిడి స్పోర్ట్స్...లో ఈ మ్యాచ్ ఉచితంగా చూసేలా... నిర్ణయం తీసుకున్నారు. మొన్నటివరకు డిడి స్పోర్ట్స్ లో ఎలాంటి ఉచిత ప్రసారాలు రాలేదు. కానీ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్ లో కూడా ఈ మ్యాచ్ ప్రసారాలు చూడవచ్చు. సోనీ స్పోర్ట్స్ 3లో హిందీ భాషలో అలాగే సోనీ స్పోర్ట్స్ 4 లో తెలుగులో మ్యాచ్ ప్రసారాలు వస్తాయి.

Next Story