- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్కంఠ మ్యాచ్‌లో ఘన విజయం.. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్
టీ20 ప్రపంచకప్, రెండో సెమీ ఫైనల్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్, రెండో సెమీ ఫైనల్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా 253 పరుగుల లక్ష్యం పెట్టినా.. ఎక్కడా బెదరకుండా ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా అదగొరట్టారు. ఒకానొక దశలో భారత్ గెలుస్తుందా? లేదా? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. మొత్తంగా 254 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 246 పరుగులే చేసింది. దీంతో భారత్ వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెతెల్ సెంచరీతో(105) చెలరేగినా ఫలితం లేకుండా పోయంది. విల్ జాక్స్ (35), జాస్ బట్లర్ (25), బాంటన్ (17), సామ్ కరణ్ (18), ఆర్చర్ (19) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బూమ్రా, వరుణ్, అక్షర్ తలో వికెట్ తీయగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43) రాణించడంతో స్కోరు ఏకంగా 253 పరుగులకు చేరింది. కెప్టెన్ సూర్య కుమార్ (11), అభిషేక్ శర్మ (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా ఇతర ప్లేయర్లు అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరును అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు, ఆదిల్ రషిద్ రెండు వికెట్లు, ఆర్చర్ ఒక వికెట్ తీశారు.






