మరోసారి భారత్, పాక్ మ్యాచ్‌?

by velandi.Saikiran |

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్ లేదా ఫైన‌ల్స్ లో భారత్ తో పాక్‌ తలపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోసారి భారత్, పాక్ మ్యాచ్‌?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. వ్యూయర్ షిప్‌ కూడా విపరీతంగా ఉంటుంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2026 లో గ్రూప్ స్టేజ్ లో భాగంగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. మ్యాచ్ శ్రీలంకలో జరిగినా జనాలు వెళ్లి చూశారు. దీంతో ఆ మ్యాచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో భాగంగా మరోసారి భారత్, పాకిస్తాన్ జ‌ట్లు తల పడబోతున్నాయట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.

భారత్, పాక్ మధ్య మరో మ్యాచ్?

టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా నిన్న పాకిస్తాన్ సూపర్ 8లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మరోసారి భారత్ తో తలపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ గ్రూప్ 1లో ఉంది. అటు పాకిస్తాన్ రెండో గ్రూప్ లో ఉంది. ఇక‌ సూపర్ 8 లో భాగంగా ఈ రెండు జట్లు తలపడడానికి ఛాన్స్ ఉండదు. కానీ సూపర్ 8లో గ్రూప్ 1లో భారత జట్టు మొదటి స్థానంలో ఉండి... అటు గ్రూప్ 2లో సెకండ్ స్థానాన్ని పాకిస్తాన్ దక్కించుకోవాలి. అలా జరిగితే సెమీ ఫైనల్స్ లో ఈ రెండు జట్ల మధ్య ఓ మ్యాచ్ ఉంటుంది. అలా కాక‌పోతే రెండు జట్లు కూడా వేరు వేరుగా సెమీ ఫైనల్స్ లో గెలిచి ఫైనల్ కు వస్తే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు భార‌త్, పాక్ ఫైన‌ల్స్ లో కొలంబో వేదిక‌గా తలపడే ఛాన్స్ ఉంటుంది.

Next Story