- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జై షా స్కెచ్.. వచ్చే 3 WTC ఫైనల్స్ ఇండియాలోనే ?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్ ( World Test Championship 2025 Final) ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఆస్

దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్ ( World Test Championship 2025 Final) ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా ( Australia) వర్సెస్ సౌత్ ఆఫ్రికా (South Africa) మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఫైనల్ ఎవరు అనేది డిసైడ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2027, 2029 అలాగే 2031 వేదికలపై కొత్త చర్చ మొదలైంది.
నెక్స్ట్ జరిగే ఈ మూడు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ ఇండియా (India) లేదా ఇంగ్లాండ్ (England) దేశంలో జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 2025 ఫైనల్ మ్యాచ్ మాత్రం లండన్ ( London) అంటే ఇంగ్లాండ్ లోనే జరుగుతుంది. 2027 ఫైనల్ మ్యాచ్ ఇండియాలోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత.... 2029 ఫైనల్ మ్యాచ్.. ఇంగ్లాండ్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి.
లేదా ఇండియాలో మళ్లీ జరిగే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. 2031 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్... కచ్చితంగా ఇండియాలో జరుగుతుందని సమాచారం అందుతోంది. అంటే మూడు ఫైనల్స్ లో ఖచ్చితంగా ఒకటి ఇంగ్లాండు రెండు ఇండియాలో జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ చీఫ్ జై షా ( Jai Shah) ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇండియాలోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని.. హైలెట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
🚨 REPORTS 🚨
— Sportskeeda (@Sportskeeda) June 14, 2025
India and England are in contention to host the finals of the WTC in 2027, 2029, and 2031. 🏟️
The final decision will be taken at the next ICC AGM. 🤝#ICC #WTC #India #England pic.twitter.com/uqHMcXlUss






