IND vs SA : ఐదో టీ20లోనూ భారత్ ఓటమి

by Harish |

IND vs SA : ఐదో టీ20లోనూ భారత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. వరుసగా మూడు టీ20ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన హర్మన్‌ప్రీత్ సేన నాలుగో టీ20లో ఊరట విజయాన్ని అందుకుంది. కానీ, ఆఖరిదైన ఐదో టీ20లో బోల్తా పడింది. బెనోనిలో సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. దీంతో భారత జట్టు సిరీస్ కోల్పోవడమే కాకుండా ఓటమితో ఇంటిదారిపట్టింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచిన సౌతాఫ్రికా 4-1తో సిరీస్ విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. ఆ జట్టులో కెప్టెన్ వొల్వార్డ్ మాత్రమే రాణించింది. 56 బంతుల్లో 92 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు నిలువరించారు. తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ, రేణుక చెరో 2 వికెట్లు తీశారు. అయితే, 156 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో భారత జట్టు విఫలమైంది. భార్తి ఫుల్మాలి(40) మాత్రమే రాణించగా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్(22), రిచా ఘోష్(25 నాటౌట్) కాసిన్ని రన్స్ జోడించడం తప్ప జట్టుకు అండగా నిలువలేదు. షెఫాలీ వర్మ(4), అనుష్క శర్మ(17) రోడ్రిగ్స్(1) నిరాశపర్చడం భారత జట్టుకు విజయాన్ని దూరం చేసింది. టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు విఫలమవడం ఆందోళన కలిగిస్తుంది.


Next Story