- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ దిగ్గజ క్రికెటర్ల రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్
కటక్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : కటక్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్‌పై 7 సిక్స్‌లు కొట్టిన అతను వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఆ స్థానంలో ఉన్న క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. గేల్ 294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్స్‌లు కొట్టగా.. రోహిత్ 259 ఇన్నింగ్స్‌ల్లోనే 332 సిక్స్‌లు బాదాడు. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(351) అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్‌గా ఉన్నాడు. అలాగే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన 3వ బ్యాటర్ రోహిత్. అతని కంటే ముందు కోహ్లీ(50), సచిన్(49) ఉన్నారు. అలాగే, వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్లలో రోహిత్ 15,404 రన్స్‌తో రెండో స్థానానికి చేరుకున్నాడు. సచిన్(15,335)ను మూడో స్థానానికి నెట్టాడు. ఆ జాబితాలో సెహ్వాగ్(15,758) అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే, సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా రోహిత్ అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువసార్లు 50కిపైగా పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్ ఘనత సాధించాడు. అంతకుముందు సచిన్(120) సార్లు 50కిపైగా స్కోరు చేశాడు.






