వర్షం ఎఫెక్ట్...ఆగిపోయిన మ్యాచ్.... టీమిండియా స్కోర్ ఎంతంటే

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5వ టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. లండన్ వేదికగా ఐదవ టెస్టు

వర్షం ఎఫెక్ట్...ఆగిపోయిన మ్యాచ్.... టీమిండియా స్కోర్ ఎంతంటే
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5వ టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. లండన్ వేదికగా ఐదవ టెస్టు ఇవాళ మూడున్నర గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. అయితే... టీమిండియా బ్యాటింగ్ కు దిగి 23 ఓవర్లు ఆడే సరికి.... వర్షం అడ్డంకిగా మారింది.

దీంతో మ్యాచ్ అర్ధాంతరంగా ఆపేశారు. ప్రస్తుతం లండన్ లోని లో భారీ వర్షం పడుతోంది. మరో గంట వరకు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఇలా ఉండగా 23 ఓవర్లు ముగిసే సమయానికి.. రెండు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 72 పరుగులు చేసింది.

ఇక మొదటి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ రెండు పరుగులకు అవుట్ కాగా... కేఎల్ రాహుల్ 14 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం సాయి సుదర్శన్, టీమిండియా కెప్టెన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Next Story