క్రికెట్ లో.. 'చెత్త రికార్డ్' మూటగట్టుకున్న భారత్!

by Geesa Chandu |

టీమిండియా శ్రీలంక స్పిన్నర్ల ముందు తలవంచారు. శ్రీలంక చేతిలో 0 - 2 తేడాతో వన్డే సిరీస్ ను కోల్పోయారు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో అన్నింట్లోనూ భారత్ ఆలౌటైంది.

క్రికెట్ లో.. చెత్త రికార్డ్ మూటగట్టుకున్న భారత్!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా శ్రీలంక స్పిన్నర్ల ముందు తలవంచారు. శ్రీలంక చేతిలో 0 - 2 తేడాతో వన్డే సిరీస్ ను కోల్పోయారు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో అన్నింట్లోనూ భారత్ ఆలౌటైంది. లంక స్పిన్నర్లను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. మూడు మ్యాచ్చుల్లో 30 వికెట్లలో 27 వికెట్లను స్పిన్నర్లకు సమర్పించుకున్నారు. మిగిలిన మూడు వికెట్లలో అసిత ఫెర్నాండో కు రెండు వికెట్లు దక్కగా.. మరొకటి రనౌట్ రూపంలో వచ్చింది. శ్రీలంక బౌలర్లలో 'హసరంగ, అసలంక, వాండర్సే, వెల్లలాగే' లు భారత బ్యాటర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఈ సిరీస్ విషయానికి వస్తే.. శ్రీలంక మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో 2 - 0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఉత్కంట భరితంగా ముగిసిన తొలి మ్యాచ్ 'టై' కాగా.. రెండో వన్డే లో 32 పరుగుల తేడాతో లంక విజయాన్ని అందుకుంది. నిన్న బుధవారం(ఆగస్టు 7) జరిగిన మూడో మ్యాచ్ లో 110 రన్స్ తేడాతో శ్రీలంక న్ లు టీమిండియాను చిత్తు చేశారు. ఫెర్నాండో కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', దునిత్ కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.

Next Story