భారత్ పాక్‌లో ఆడినా చాంపియన్స్ ట్రోఫీని గెలిచేది : వసీమ్ అక్రమ్

by Harish |

చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్ పాక్‌లో ఆడినా చాంపియన్స్ ట్రోఫీని గెలిచేది : వసీమ్ అక్రమ్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కూడా ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత భారత జట్టు పాకిస్తాన్‌లో ఆడినా చాంపియన్స్ ట్రోఫీ గెలిచేదని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాక్‌కు వెళ్లడానికి నిరాకరించిన భారత్.. ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లను దుబాయ్ ఆడిన విషయం తెలిసిందే. ఒకే వేదికపై ఆడటం టీమిండియాకు కలిసొచ్చిందని పలువురు చేస్తున్న విమర్శలను వసీమ్ అక్రమ్ కొట్టిపారేశాడు. ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదన్నాడు. ‘దుబాయ్‌ వేదికగా అన్ని మ్యాచ్‌లు ఆడటం భారత్‌కు అడ్వాంటేజ్ అని చాలా మంది అన్నారు. టీమిండియా దుబాయ్‌లోనే కాదు ఒకవేళ పాకిస్తాన్‌లో ఆడినా అక్కడ కూడా గెలిచేది. ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా టీ20 వరల్డ్ కప్ గెలిచారు. చాంపియన్స్ ట్రోఫీ కూడా అంతే. ఇది వారి సామర్థ్యం, మేటి నాయకత్వానికి అద్ధం పడుతోంది.’అని చెప్పుకొచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు నిరాశ ఫలితాలు వచ్చాయని, అయినప్పటికీ బీసీసీఐ తమ కెప్టెన్, కోచ్‌కు మద్దతుగా నిలిచిందన్నాడు. ఇప్పుడు వాళ్లు చాంపియన్‌గా నిలిచారని చెప్పాడు.


Next Story