భువీని టీమిండియాకు ఎంపిక చేయండి.. బీసీసీఐకి సెహ్వాగ్ సూచన

by Harish |

భువీని టీమిండియాకు ఎంపిక చేయండి.. బీసీసీఐకి సెహ్వాగ్ సూచన
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున సత్తాచాటుతున్న భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని బీసీసీఐకి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ‘ఆర్సీబీ విజయాల్లో భువనేశ్వర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో 2-3 వికెట్లు తీస్తున్నాడు. అతనికి 35 లేదా 36 ఏళ్లు ఉండొచ్చు. అయితే ఏంటి?. అతను అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నాడు. కాబట్టి అతను టీ20 ఫార్మాట్‌లో కమ్‌బ్యాక్ గురించి ఆలోచించాలి. సెలెక్టర్లు కూడా అతన్ని విషయంలో పునరాలోచించాలి. బుమ్రా, భువనేశ్వర్ కాంబినేషన్‌ను మనం ఉపయోగించాం. మరోసారి కూడా ఆ కాంబినేషన్ ప్రయత్నించొచ్చు. భువీ కొత్త, పాత రెండు బంతులతోనూ రాణిస్తున్నాడు. అన్ని బలమైన జట్లపై కూడా అతను ఆకట్టుకుంటున్నాడు. అతని ఆటను నేను ఎంజాయ్ చేస్తున్నాం. వింటేజ్ భువనేశ్వర్‌ అని పిలవొచ్చు ’అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో భువీ 9 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరపున అతను 2022లో చివరి మ్యాచ్ ఆడాడు.

Next Story