- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WTC ఫైనల్ మ్యాచ్‌లపై ఐసీసీ కీలక ప్రకటన
WTC ఫైనల్ మ్యాచ్‌లపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ప్రకటన జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : WTC ఫైనల్ మ్యాచ్‌లపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ప్రకటన జారీ చేసింది. ఐసీసీ వార్షిక సమావేశంలో 2027, 2029, 2031 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా ఇతర దేశాల నుండి వచ్చిన హోస్టింగ్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, ఇంగ్లాండ్‌కు హోస్టింగ్ బాధ్యతలు కట్టబెట్టింది. జూన్ నెలలో అనుకూల వాతావరణం, టెస్ట్ మ్యాచ్‌లకు పెద్ద ఎత్తున జనాదరణ, అత్యుత్తమ సౌకర్యాలు కలిగి ఉన్న కారణంగా ఇంగ్లాండ్ ను ఎంపిక చేశామని ఐసీసీ పేర్కొంది.
కాగా డబ్ల్యూటీసీ ప్రారంభం నుంచి జరిగిన 3 సీజన్ల ఫైనల్స్(2021,23, 25) కూడా ఇంగ్లాండ్ లోనే జరిగాయి. తరువాత జరుగబోయే 2027,29,31 లోనూ అక్కడే జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు హోస్టింగ్ రైట్స్ ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు అప్పగించింది.






