రౌఫ్, ఫర్హాన్‌‌‌లను వదిలిపెట్టని ఐసీసీ.. మూల్యం చెల్లించుకున్న పాక్ క్రికెటర్లు

by Harish |

ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు హారిస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌ కవ్వింపులకు పాల్పడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

రౌఫ్, ఫర్హాన్‌‌‌లను వదిలిపెట్టని ఐసీసీ.. మూల్యం చెల్లించుకున్న పాక్ క్రికెటర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు హారిస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌ కవ్వింపులకు పాల్పడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వికెట్లు తీసినప్పుడు రౌఫ్ భారత్‌కు చెందిన ఆరు జెట్ ఫ్లైట్స్‌ను కూల్చేశామంటూ ఆరు వేళ్లను చూపించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఫర్హాన్ భారత్ డ్రెస్సింగ్ రూం వైపు గన్ ఫైరింగ్ చేస్తున్నట్టు సంబరాలు చేసుకున్నాడు. వారు ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని భారత్‌ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో రౌఫ్, ఫర్హాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. శుక్రవారం వారిద్దరూ ఐసీసీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తాము ఏం తప్పుచేయలేదంటూ వాదించినట్టు తెలుస్తోంది. 6-0 సంజ్ఞ భారత్‌కు సంబంధించింది కాదని రౌఫ్ చెప్పాడు. అలాగే, గన్ సెలబ్రేషన్‌ రాజకీయ ప్రేరేపితమైనవి కాదని ఫర్హాన్ వాదించాడు. తమ ప్రాంతంలో సంతోషకరమైన సందర్భాల్లో ఇలాంటి వేడుకలు సాధారణమంటూ తెలిపాడు. కానీ, ఐసీసీ వారి వాదనలతో సంతృప్తి చెందలేదు. వారిద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు తేల్చింది. దీంతో రౌఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. ఫర్హాన్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టింది.


Next Story