ఐ డోంట్ కేర్.. జట్టులో మార్పులపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చిన గంభీర్

by Harish |

చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టులో మార్పులు చేయడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఐ డోంట్ కేర్.. జట్టులో మార్పులపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చిన గంభీర్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టులో మార్పులు చేయడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐదుగురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం, బ్యాటింగ్ ఆర్డర్‌లో రాహుల్ కంటే ముందు అక్షర్‌ను పంపించడం, అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించకపోవడం వంటి విషయాల్లో మాజీలు అతని నిర్ణయాలను ప్రశ్నించారు. దీనిపై గంభీర్ ఘాటుగా స్పందించాడు. ఆసిస్‌తో మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ మాట్లాడుతూ.. వాటిని తాను పట్టించుకోవడం లేదన్నాడు. ‘ఐ డేంట్ కేర్. 140 కోట్ల భారతీయులకు, డ్రెస్సింగ్ రూంలోని నా ఆటగాళ్లకు నిజాయతీగా ఉండటమే నా పని. విమర్శలు చేసే వారు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను. నా ఉద్యోగ్యంలో నిజాయితీగా ఉంటాను. అదే ముఖ్యం. అప్పుడే నేను ప్రశాంతంగా నిద్రపోతాను.’అని చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్‌ను 5వ స్థానంలో పంపించడంపై గంభీర్ స్పందిస్తూ..‘అక్షర్ వ స్థానంలో బ్యాటింగ్ చేస్తునప్పటి నుంచి చక్కటి సహకారం అందిస్తున్నాడు. జట్టుగా మేము కావాల్సినది పొందడానికి అతను 5వ స్థానంలో రావడం చాలా ముఖ్యం. భవిష్యత్తులోనూ అదే కొనసాగుతోంది.’అని చెప్పుకొచ్చాడు.


Next Story