- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా ఓపెన్‌లో ప్రణయ్ శుభారంభం.. నిరాశ పరిచిన లక్ష్యసేన్
by Phanindra |
చైనా ఓపెన్‌లో ప్రణయ్ శుభారంభం చేశాడు. అయితే తొలి రౌండ్‌లోనే ఓడిన లక్ష్యసేన్ నిరాశ పరిచాడు.

X
దిశ, స్పోర్ట్స్: చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. ప్రపంచ 35వ ర్యాంకర్ అయిన ప్రణయ్.. 18వ ర్యాంకర్ అయిన జపాన్ ప్లేయర్ కోకి వాతానబేపై 8-21, 21-16, 23-21 తేడాతో విజయం సాధించాడు. ఇదే టోర్నీలో మరో భారత స్టార్ లక్ష్యసేన్ నిరాశపరిచాడు. చైనాకు చెందిన ఐదో సీడ్ లి షి ఫెంగ్‌తో జరిగిన మ్యాచులో తొలి గేమ్ నెగ్గిన సేన్.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్స్‌లో ఓడాడు. వరుసగా 21-14, 22-24, 11-21 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్ ఆడుతున్న ఎ. సూర్య-ఎ. ప్రముతేష్, రోహన్ కపూర్-రుత్విక గద్దె జోడీలు కూడా తమ ఓపెనింగ్ మ్యాచుల్లో ఓటమి చవిచూశారు.
Next Story






