'ఆమె' రాత్రికి రాత్రే బరువు ఎలా పెరిగిందో..? డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్

by Geesa Chandu |

వినేష్ ఫొగాట్ రెండు రోజులు స్థిరంగా ఉన్న తర్వాత, ఇప్పుడు ఉన్న పళంగా బరువు ఎలా పెరిగిందో చెప్పాలని.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ సంజయ్ సింగ్ అన్నారు.

ఆమె రాత్రికి రాత్రే బరువు ఎలా పెరిగిందో..? డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వినేష్ ఫొగాట్ రెండు రోజులు స్థిరంగా ఉన్న తర్వాత, ఇప్పుడు ఉన్న పళంగా బరువు ఎలా పెరిగిందో చెప్పాలని.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ సంజయ్ సింగ్ అన్నారు.అందుకు గల కారణాలను "ఆమె వ్యక్తిగత పోషకాహార నిపుణుడు మరియు ఆమె కోచ్ మాత్రమే చెప్పగలరని ఆయన పేర్కొన్నారు. డబ్ల్యూఎఫ్ఐ చట్ట పరమైన ప్రక్రియను ఇప్పుడు చూసుకుంటోంది. ప్రస్తుతం IOA ప్రెసిడెంట్ 'పీటీ ఉష' పారిస్ ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నారు" అని ఈ సందర్బంగా సంజయ్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Next Story