ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్‌ క్రికెటర్‌..

by Vinod kumar |   (  Updated:2023-05-17 11:21:55  IST  )

తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్‌ యువ క్రికెటర్‌ హ్యారీ టెక్టార్‌ చరిత్ర సృష్టించాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్‌ క్రికెటర్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్‌ యువ క్రికెటర్‌ హ్యారీ టెక్టార్‌ చరిత్ర సృష్టించాడు. తన దేశం తరఫున అత్యధిక రేటింగ్‌ పాయింట్లు (722) సాధించిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అయితే ఈ రికార్డు గతంలో పాల్‌ స్టిర్లింగ్‌ పేరిట ఉండేది. 2021 జూన్‌లో స్టిర్లింగ్‌ 697 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీ చేయడం ద్వారా స్టిర్లింగ్‌ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్‌.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి (7వ ర్యాంక్‌) కూడా చేరాడు.

ఈ జాబితాలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఫస్ట్ ప్లేస్ నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్‌డెర్‌ డస్సెన్‌, పాక్‌ ఫఖర్‌ జమాన్‌, పాక్‌కే చెందిన ఇమామ్‌ ఉల్‌ హాక్‌, ఇండియా శుభ్‌మన్‌ గిల్‌, ఆసీస్‌ డేవిడ్‌ వార్నర్‌, ఐర్లాండ్‌ హ్యారీ టెక్టార్‌, టీమిండియా విరాట్‌ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్‌, టీమిండియా రోహిత్‌ శర్మ టాప్‌-10లో ఉన్నారు.

Also Read..

IPL 2023: ఆ రెండు జట్లకు విలన్‌గా మారనున్న సన్‌రైజర్స్‌..!

Next Story