DC vs GT : ప్లే ఆఫ్ కు చేరిన గుజరాత్ టైటాన్స్

by Muthe.Rajitha |

ఈ ఐపీఎల్(2025 IPL) సీజన్లో ప్లే ఆఫ్ కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్(GT) నిలిచింది.

DC vs GT : ప్లే ఆఫ్ కు చేరిన గుజరాత్ టైటాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఐపీఎల్(2025 IPL) సీజన్లో ప్లే ఆఫ్ కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్(GT) నిలిచింది. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(DC vs GT) మధ్య జరిగిన మ్యాచ్ లో GT 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ కు దూసుకు పోయింది. కాగా తొలుత బ్యాటింగ్ కు దిగిన DC 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేయగా.. 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.3 ఓవర్లలోనే చేధించింది.

గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ 61 బాల్స్ లో 12 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ కొట్టాడు(108). గిల్ కూడా 53 బాల్స్ లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 93 పరుగులు చేయడంతో GT కి విజయం ఈజీ అయింది. అటు ఢిల్లీ జట్టులో రాహుల్ సెంచరీ చేసినప్పటికీ విజయం మాత్రం గుజరాత్ నే వరించింది.

Next Story