టాస్ గెలిచిన గుజరాత్..ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-04-19 09:47:25  IST  )

ఐపీఎల్ 2025 ( IPL 2025 ) టోర్నమెంటులో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans ) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delh

టాస్ గెలిచిన గుజరాత్..ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 ( IPL 2025 ) టోర్నమెంటులో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans ) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ గుజరాత్ సొంత గడ్డ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ( Ahmedabad Narendra Modi Stadium ) నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన.. టాస్ వేశారు. ఇందులో టాస్ గెలిచిన... గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

అటు ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. సొంత గడ్డ కావడంతోపాటు టాస్ గెలిచిన గుజరాత్... ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని.. భారీ ప్లాన్ తోనే దిగుతోంది. అటు పాయింట్స్ టేబుల్ లో దూసుకు వెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా... గుజరాత్ ను చిత్తు చేయాలని భారీ వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ : అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్(w), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

గుజరాత్ టైటాన్స్ : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ( C ), జోస్ బట్లర్(w), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ

Next Story