- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్స్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)ల అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వీరిద్దరూ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో(Vijay Hazare Trophy) ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ తమ జట్టు తరఫున ఆడతారని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. అటు ఈ టోర్నమెంట్‌లో తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ ఆడనున్నారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. డిసెంబర్ 24 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మరోవైపు.. వన్డే, టీ20 జట్లలో ఉన్న భారత ఆటగాళ్లందరూ డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీ (2025-26)లో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ షెడ్యూల్ నుంచి విరామం ఉన్నప్పుడు, సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడం ద్వారా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాలనేది బోర్డు ఉద్దేశం. అలాగే సీనియర్లు ఆడటం వల్ల యువ ఆటగాళ్లకు కూడా ప్రేరణ లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది.






