ముంబైలో మెస్సీ మేనియా.. భారత్ ఫుట్‌బాల్ దిగ్గజం ఛెత్రితో సందడి

by Ramesh Naini |

‘ది గోట్ ఇండియా టూర్‌’లో భాగంగా అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్‌ మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు.

ముంబైలో మెస్సీ మేనియా.. భారత్ ఫుట్‌బాల్ దిగ్గజం ఛెత్రితో సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ది గోట్ ఇండియా టూర్‌’లో భాగంగా అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్‌ మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం విచ్చేసిన మెస్సీ తన బృందంతో కలిసి ఆదివారం ముంబై (Mumbai)లో సందడి చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ ప్రముఖ క్రిడాకారులను కలిశారు. ఈ సందర్భంగా భారత్ ఫుట్ దిగ్గజ క్రీడాకారుడు సునీల్ ఛెత్రిని మెస్సీ కలిశారు. ఈ మేరకు మెస్సీ తన 10 నెంబర్ గల జెర్సీని బహుమతిగా ఇచ్చారు. భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ గోట్.. అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ గోట్ ఒకే వేదికను పంచుకోవడంతో అభిమానులకు అభిమానులకు కనువిందు చేసింది. ఈ అరుదైన సన్నివేశాన్ని స్డేడియంలోని ప్రేక్షకులు వారి సెల్ ఫోన్‌లలో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మెస్సీ కలిసి సందడి నెలకొల్పారు. వీడియో ఇదే..

Next Story