నేడు ఆసీస్ తో రెండో టీ20.. గంభీర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ !

by velandi.Saikiran |

గంభీర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇవాళ జరిగే మ్యాచ్ లో కచ్చితంగా అర్ష‌దీప్‌సింగ్ ను జ

నేడు ఆసీస్ తో రెండో టీ20.. గంభీర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ రెండో టి20 జరగనుంది. మెల్ బోర్న్‌ వేదికగా జరగనున్న ఈ రెండో టి20 మ్యాచ్ మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టి20 రద్దు అయింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఇవాళ రెండు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీలకం. ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు టీమిండియా అభిమానులు.

ఇవాళ జరిగే మ్యాచ్ లో కచ్చితంగా అర్ష‌దీప్‌సింగ్ ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకోవడంపై ఫైర్ అవుతున్నారు. హర్షిత్ రాణా ఆల్ రౌండ‌ర్‌ అంటూ తీసుకోవడం దారుణమని మండిపడుతున్నారు. అతడు ఇంత వరకు పెద్ద ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవని నిప్పులు చెరుగుతున్నారు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అర్షదీప్ లాంటి ప్లేయర్లను ఇప్పటి నుంచి ఆడించాలని కోరుతున్నారు. ఇవాళ్టి మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ ఆడకపోతే గౌతమ్ గంభీర్ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story