రోహిత్‌కు టెస్టు కెప్టెన్సీపై ఇంట్రస్ట్ లేదు.. నేనే ఒప్పించానన్న మాజీ లెజెండ్!

by Phanindra |

రోహిత్‌కు టెస్టు కెప్టెన్సీపై పెద్దగా ఇంట్రస్ట్ లేదని, కోహ్లీ తప్పుకున్నాక రోహిత్‌ను తనే ఒప్పించానని మాజీ లెజెండ్ వెల్లడించాడు.

రోహిత్‌కు టెస్టు కెప్టెన్సీపై ఇంట్రస్ట్ లేదు.. నేనే ఒప్పించానన్న మాజీ లెజెండ్!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా టెస్టు కెప్టెన్సీ చేయడానికి రోహిత్ శర్మ మొదట్లో అంగీకరించలేదని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా సారధిగా కోహ్లీ తప్పుకున్న తర్వాత జట్టు పగ్గాలు రోహిత్‌ చేతికి వచ్చాయి. అయితే ఈ రోల్‌పై రోహిత్ ఏమాత్రం ఇంట్రస్ట్ చూపించలేదని గంగూలీ వెల్లడించాడు.

‘మేం విరాట్‌ను టెస్టు కెప్టెన్‌గా కొనసాగించాలని అనుకున్నాం. కానీ తను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. దీంతో అప్పటికే వన్డేలు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌కు టెస్టు జట్టును కూడా అప్పగించాలని నిర్ణయించాం. నేను స్వయంగా వెళ్లి రోహిత్‌తో మాట్లాడా. అతను మంచి కెప్టెన్ అని నా నమ్మకం’ అని గంగూలీ అప్పటి విషయాలు గుర్తుచేసుకున్నాడు. ‘టెస్టు కెప్టెన్సీ తీసుకోవడానికి రోహిత్ తటపటాయించాడు.


అయితే టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్సీ చేయకుండా కెరీర్ ముగించాలని అనుకుంటున్నావా? అని అడిగా. అది తను రెస్పాండ్ అయ్యేలా చేసింది. కొన్నిరోజుల టైం అడిగి, ఆ తర్వాత కెప్టెన్సీ తీసుకోవడానికి అంగీకరించాడు’ అని గంగూలీ వెల్లడించాడు.

Next Story