సంజు శాంస‌న్ పై ఫ్యాన్స్ తిరుగుబాటు...ఇక క‌థ మిగిసిన‌ట్లే ?

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య చివరి టీ20 తిరువనంతపురంలో జరిగింది. ఇది సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్ కావడంతో కచ్చితంగా ఇరగదీస్తాడని అందరూ అనుకున్నారు.

సంజు శాంస‌న్ పై ఫ్యాన్స్ తిరుగుబాటు...ఇక క‌థ మిగిసిన‌ట్లే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ( Sanju Samson) కెరీర్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. మొన్నటి వరకు ధ్రువ తారలాగా మెరిసిన వికెట్ కీపర్ సంజు శాంసన్, ఇప్పుడు వాలిపోయిన పువ్వులా మారిపోయాడు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కోసం సంజు శాంసన్ ను సెలెక్ట్ చేసినప్పటికీ, అతనికి తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు టీ20 సిరీస్ లో మనోడు చెత్త ప్రదర్శన కనబరచడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో సంజు శాంస‌న్ స్థానంలో ఇషాన్ కిష‌న్ ( Ishan kishan) సెటిల్ అవుతాడ‌ని అంటున్నారు.

న్యూజిలాండ్ సిరీస్ లో తేలిపోయిన సంజు శాంసన్

భారత్, న్యూజిలాండ్ ( Newzealand India) మధ్య మొన్నటి వరకు 5 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా భారత జట్టును సంసిద్ధం చేసేందుకు న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ ఫిక్స్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీని కోసం దాదాపు టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టును సెలెక్ట్ చేశారు. ఇందులో సంజు శాంసన్ ఉండడమే కాకుండా ప్రతి మ్యాచ్ లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. కానీ ఒక్క మ్యాచ్ లో ఆడితే ఒట్టు... ప్రతి మ్యాచ్ లో తన డై హార్ట్ అభిమానులను కూడా హర్ట్ చేసేలా చెత్త ప్రదర్శన కనబరిచాడు సంజు శాంస‌న్‌. దీంతో ఇప్పుడు అతనిపై సొంత అభిమానులే తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొంది.

తిరువనంతపురంలో కూడా చేతులెత్తేసిన సంజు

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య చివరి టీ20 తిరువనంతపురంలో జరిగింది. ఇది సంజు శాంసన్ ( Sanju Samson) హోమ్ గ్రౌండ్ కావడంతో కచ్చితంగా ఇరగదీస్తాడని అందరూ అనుకున్నారు. తిరువనంతపురం లో ఉన్న అభిమానులు అయితే సంజు కోసం పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. ధోని రేంజ్ లో అతన్ని ఊహించుకొని అంచనాలను పెంచేశారు. ఎన్నో డబ్బులు పెట్టి టికెట్లు కూడా కొనుగోలు చేశారు. ఆ రోజున స్టేడియం మొత్తం హౌస్ ఫుల్ అయింది. కానీ చివరికి అందరినీ నిరాశకు గురి చేశాడు సంజు శాంసన్. ఆ మ్యాచ్ లో అర్థ సెంచరైన చేస్తాడని అందరూ అనుకున్నారు.

కానీ అక్కడ కూడా తేలిపోయాడు. దానికి తగ్గట్టుగానే ఇషాన్ కిష‌న్ అదే మ్యాచ్ లో సెంచరీతో ఇరగదీశాడు. ఇంకే ముంది టీ20 వరల్డ్ కప్ లో సంజు రిజర్వ్ బెంజ్ కే పరిమితం అవుతాడని అంటున్నారు. ఇషాన్ కిషన్ కచ్చితంగా తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే కాకుండా ఓపెనర్ గా సెటిల్ అవుతాడని అంటున్నారు. సంజు పై నమ్మకాన్ని పెంచుకుంటే తమల్ని నట్టేట ముంచాడని ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని ఛాన్సులు ఇస్తారు అంటూ.. తిరుగుబాటు చేస్తున్నారు అభిమానులు.

Next Story