- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20WorldCup2026: చేజేతులా పోగొట్టుకున్న న్యూజిలాండ్.. ఇంగ్లండ్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు జఘ విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026), సూపర్-8లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు జఘ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకానొక దశలో న్యూజిలాండ్‌కు గెలుపు అవకాశాలు వచ్చినా.. సరైన విధంగా యూజ్ చేసుకోకపోవడంతో నిరాశ తప్పలేదు. మొత్తంగా న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(26), బెతెల్(21), బాంటాన్(33), సామ్ కరణ్(24), విల్ జాక్స్(32) రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర మూడు, ఫిలిప్స్, హెన్రీ, ఫెర్గుసన్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(39), టిమ్ సీఫర్ట్(35), ఫిన్ అలెన్(29) తప్ప మిగిలిన ప్లేయర్లంతా విఫలం అయ్యారు. రచిన్ రవీంద్ర(11), చాప్‌మన్(15), మిచెల్(3), కోంచీ(14), శాంట్నర్(9), హెన్రీ(1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2, విల్ జాక్స్ 2, రెహాన్ అహ్మద్ 2, డాసన్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.






