T20WorldCup2026: ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు ఇంగ్లాండ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-24 17:18:09  IST  )

టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది.

T20WorldCup2026: ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు ఇంగ్లాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని చివరి వరకు పోరాడి చేధించారు. మొత్తంగా 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌.. 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (100), విల్ జాక్స్(25) పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. పాకిస్తాన్ బౌలర్లలో షహిన్ ఆఫ్రీది నాలుగు వికెట్లు, ఉస్మాన్ తారిఖ్, నవాజ్ చెరో రెండేసి వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్(63) హాఫ్ సెంచరీతో రాణించారు. బాబర్ అజాం(25), ఫఖర్ జమాన్(25), షాదాబ్ ఖాన్(23) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 3, జోఫ్రా ఆర్చర్, జెమీ చెరో 2, ఆదిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు.

Next Story