న్యూజిలాండ్‌కు ఇంగ్లాండ్ షాక్.. కివీస్ గడ్డపై 15 ఏళ్ల తర్వాత..

by Disha Web Desk 13 |
న్యూజిలాండ్‌కు ఇంగ్లాండ్ షాక్.. కివీస్ గడ్డపై 15 ఏళ్ల తర్వాత..
X

మౌంట్ మౌంగనుయ్: ఆతిథ్య న్యూజిలాండ్‌కు ఇంగ్లాండ్ షాకిచ్చింది. తొలి టెస్టులో 267 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత కివీస్ గడ్డపై ఇంగ్లాండ్ విజయం దక్కింది. దీనికంటే ముందు 2008లో న్యూజిలాండ్ గడ్డపై చివరిసారిగా ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 393 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 126 పరుగులకే కుప్పకూలింది.

ఓవర్ నైట్ స్కోరు 63/5తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన కివీస్‌ మిగతా ఐద వికెట్లను కూడా కోల్పోయింది. డారిల్ మిచెల్(57 నాటౌట్) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే, మిగతా బ్యాటర్లందరూ విఫలమవడంతో కివీస్ ఓటమి పాలైంది. బౌలర్లు జేమ్స్ అండరన్స్, స్టువర్ట్ బ్రాడ్ చెరో 4 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించారు. దాంతో ఇంగ్లాండ్ 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Next Story

Most Viewed