తల్లి చివరి కోరిక..శ్రీదేవి చనిపోయిన తర్వాత అలాంటి పని చేయడం మానేసిన జాన్వీ?

by Disha Web Desk 8 |
తల్లి చివరి కోరిక..శ్రీదేవి చనిపోయిన తర్వాత అలాంటి పని చేయడం మానేసిన జాన్వీ?
X

దిశ, సినిమా : అతిలోక సుందరి అందాల తార దివంగత శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తళక్కుమనే అందంతో, తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆరోజుల్లో , ఇప్పటి వారికి కూడా ఈ నటి అంటే అమితమైన అభిమానం. ఎవరూ ఊహించని విధంగా ఈ నటి అనుమానాస్పదంగా బాత్ టబ్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఇక ఈమె తర్వాత, తన గారాల పట్టీ జాన్వీకపూర్ వెండి తెర మీదకు అడుగు పెట్టింది. అచ్చం అమ్మపోలికలతో ఉండే ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంది. అంతే కాకుండా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారును మాయ చేస్తుంది ఈ నటి.

ఇక ప్రస్తుతం ఈ నటి తెలు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి వరసగా ఆఫర్స్ కొట్టేస్తున్న విషయం తెలిసిందే. తారక్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ అలాంటి పని చేయడం మానేసిదంట. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.జాన్వీకి స్మోకింగ్ అలవాటు చాలా ఎక్కువగా ఉండేదంట. తన తల్లి ఎన్ని సార్లు చెప్పినా ఆ అలవాటు మానలేదంట. కానీ శ్రీదేవి చనిపోయిన తర్వాత మాత్రం ఆమె చివరి కోరికగా భావించి స్మోకింగ్ మానేసినట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read More..

శ్రీదేవి, జాన్వి అభిమానులకు స్వీట్ న్యూస్.. వారి ఇంట్లో ఒక్కరోజు ఉండే ఛాన్స్.. ఈ ఆఫర్ మిస్ అవొద్దు..

Next Story

Most Viewed