బెన్ స్టోక్స్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

by Gantepaka Srikanth |

మాంచెస్టర్(Manchester) వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్(England) బ్యాటర్లు అదరగొడుతున్నారు.

బెన్ స్టోక్స్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మాంచెస్టర్(Manchester) వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్(England) బ్యాటర్లు అదరగొడుతున్నారు. టీమిండియా(India) బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఒకరిద్దరు మినహాయించి.. మిగిలిన బ్యాటర్లంతా రఫ్పాడించారు. తాజాగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) సెంచరీ చేశారు. ఇప్పటివరకు 173 బంతులు ఆడిన స్టోక్స్.. 108 పరుగులు చేశారు. ఇందులో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు జాక్ (84), డకెట్ (94), పోప్ (71), రూట్ (150)లు కూడా సత్తా చాటారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 604 పరుగులు చేసింది. 256 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. భారత బౌలర్లలో బూమ్ర, జడేజా, సుందర్ తలో రెండేసి వికెట్లు తీయగా, కాంబోజ్, సిరాట్ చెరో వికెట్ తీశారు.

Next Story