- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4-0తో చెన్నయిన్ ఓటమి.. ఏమాత్రం పోరాడలేకపోయిన టీం!
ఏఐఎఫ్ఎఫ్ సూపర్ కప్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీ 4-0తో ఓటమి పాలైంది. ఈస్ట్ బెంగాల్ ముందు ఏమాత్రం పోరాడలేకపోయిందీ టీం.

దిశ, స్పోర్ట్స్: ఏఐఎఫ్ఎఫ్ సూపర్ కప్ గ్రూప్-ఎ మ్యాచులో చెన్నయిన్ ఎఫ్‌సీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. టోర్నీలో తమ రెండో మ్యాచులో ఈస్ట్ బెంగాల్‌తో తలపడిన చెన్నయిన్ ఏకంగా 4-0 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచును ఉత్సాహంగా మొదలు పెట్టిన చెన్నయిన్.. ఆ జోరును ఎంతోసేపు కొనసాగించలేకపోయింది. దక్కిన ఒకటి రెండు అవకాశాలను గోల్స్‌గా మలచుకోలేకపోయింది. 18వ నిమిషంలో గాయం వల్ల జితేశ్వర్ సింగ్ తప్పుకోవడంతో చెన్నయిన్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఇక ఆ తర్వాత పుంజుకున్న ఈస్ట్ బెంగాల్ రెచ్చిపోయింది. తొలి అర్థభాగంలోనే మూడు గోల్స్ చేసి చెన్నయిన్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేసింది. సెకండ్ హాఫ్‌లో గట్టిగా పోరాడినప్పటికీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయిందీ టీం. చివరకు 4-0 తేడాతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచులో శుక్రవారం నాడు డెంపో ఎస్‌సీతో చెన్నయిన్ తలపడుతుంది.






