ప్లీజ్ అలా నన్ను పిలవద్దు.. ఫ్యాన్స్ కు కోహ్లి విజ్ఞప్తి

by Dishanational6 |
ప్లీజ్ అలా నన్ను పిలవద్దు.. ఫ్యాన్స్ కు కోహ్లి విజ్ఞప్తి
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ మానియా మొదలైంది. మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ 17 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ సీఎస్కే, ఆర్సీబీ మధ్య జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్ బాక్స్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ ని దానిష్ సేథ్ హోస్ట్ చేశాడు. ఫ్యాన్స్ లానే తను కూడా కింగ్ కోహ్లీ అని పిలిచే సరికి.. విరాట్ దాన్ని అడ్డుకున్నాడు.

తనను విరాట్ అని పిలవాలని.. కింగ్ అని పేరు పెట్టి పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నానని తెలిపాడు. ఆ పేరు వల్ల నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తాయని తెలిపాడు. నిజంగానే కింగే ఏమో అని భయపడతానని అన్నారు. అప్పుడప్పుడు అది గేమ్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుందన్నాడు. ఇక నుంచి ఫ్యాన్స్ అందరూ విరాట్ ని పిలవాలని.. ఆ పేరైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందన్నాడు. లేనిపోని ట్యాగ్ లతో పిలిచి ఇబ్బంది పెట్టొద్దని ఫ్యాన్స్ ని కోరాడు. ఈ విషయాన్ని డుప్లిసెస్ తో డిస్కస్ చేశానన్నాడు. దయచేసి ఫ్యాన్స్ అందరూ తనను విరాట్ అనే పిలవాలని కోరాడు.


Next Story

Most Viewed